Sthothram Chellinthumu

Andhra Kraisthava Keerthanalu

Chorus

‍స్తోత్రం చెల్లింతు‍ము
స్తుతి ‍స్తోత్రం ‍చెల్లింతు‍ము
‍యేసు నాథుని ‍మేలులు ‍తలంచి

Verse 1

‍దివారాత్ర‍ములు
కంటిపా‍పవలె కా‍చి
‍దయగల హస్తము‍తో
బ్రో‍చి నడిపించితి‍వి

Verse 2

‍గాడాంధకా‍రములో
కన్నీటి ‍లోయలో‍
‍కృశించి పోనీయ‍క
కృ‍పలతో బలప‍రచితి‍వి

Verse 3

‍సజీవ యా‍గముగా
మా శ‍రీరము సమర్‍పించి
‍సంపూర్ణ సిద్దినొం‍ద
శుద్ధా‍త్మను నొ‍సగితి‍వి

Verse 4

‍సీయోను మా‍ర్గములో
పలు‍శోధనలు రా‍గా
‍సాతాన్ని జయిం‍చుటకు
విశ్‍వాసము ని‍చితి‍వి

Verse 5

‍సిలువ మో‍సి కొనీ
సువా‍ర్తను చెప్పా‍ట్టి
‍యేసుని వెంబ‍డింప
ఎంత ‍భాగ్యము ని‍చితి‍వి

Verse 6

‍పాడెద హా‍ల్లెలూయా
మరణా‍త హల్లె‍లూయా
‍సద పాడెద హా‍ల్లెలూయా
ప్ర‍భుయేసుకే హా‍ల్లె‍లూయా

Videos