Rakshakudu Puttade
Intro
రక్షకుడు పుట్టాడే రక్షణను తెచ్చాడే
పాపులకు ప్రాయశ్చిత్తం ఇచ్చుటకు వచ్చాడే
పూజించి ఘనపరచెదము ఆ రక్షకుడు యేసును
కోనియాడి స్తుతియించెదము ఇమ్మానుయేలుని
పూజించి ఘనపరచెదము ఆ రక్షకుడు యేసును
కోనియాడి కీర్తించెదము ఇమ్మానుయేలుని
Verse 1
ఆ జ్ఞానులు వచ్చారే శ్రీయేసును చూశారే
ఆ గొల్లలు వచ్చారే క్రీస్తుని ప్రకటించారే (2)
సాగిలపడి మ్రొక్కారే
కానుకలు అర్పించారే
రక్షకుడు వచ్చెనని సంతసించి వెళ్లారే || పూజించి ||
Verse 2
లోకాన్ని ప్రేమించాడే పరమును విడి వచ్చాడే
పరలోకపు వారసత్వము ఇచ్చుటకు వచ్చాడే (2)
పాపములను క్షమియించాడే
శాపములను తొలగించాడే
తన ప్రాణము అర్పించి మనలని రక్షించాడే || పూజించి ||