Oohinchaleni Melulatho Nimpina
Verse 1
ఊహించలేని మెలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యములు
వివరించగలనా నీ మెలులన్ (2) ||ఊహించలేని||
Verse 2
మెలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
Verse 3
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు (2)
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||